టీడీపీలో ఉండాలి లేదా అనే దానిపై దివ్యవాణి క్లారిటీ

టీడీపీలో ఉండాలి లేదా అనే దానిపై దివ్యవాణి క్లారిటీ

0

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి… ఈ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాభవం ఎదుర్కున్న తరువాత తమ్ముళ్లు ఇతర పార్టీల్లోకి వెళ్లడం షురూ చేసుకుంటున్నారు.

ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీని వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఇక రేపో మాపో టీడీపీ ఫైర్ బ్రాండ్ అధికార ప్రతినిధి సాధినేని యామిని కూడా బీజేపీలో చేరుతుందని వార్తలు వస్తున్నాయి..

ఇక ఇదే క్రమంలో నటి దివ్యవాణి కూడా పార్టీ మారుతారనే వార్త ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది… ఈ నేపథ్యంలో ఆమె పార్టీ మారడంపై క్లారిటీ ఇచ్చింది… తన తుది శ్వాశ ఉన్నంత వరకు టీడీపీలో ఉంటానని స్పష్టం చేశారు… కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీ కోసం కష్టపడాలి అప్పుడే నిజమైన నాయకులు అవుతారని అన్నారు