టైట్ రేసులో నెగ్గిన డీఎంకే అభ్యర్థి

టైట్ రేసులో నెగ్గిన డీఎంకే అభ్యర్థి

0

వేలూరు లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థి కాథిర్ ఆనంద్ గెలుపొందారు. ఆయన 8460 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అన్నాడీఎంకే అభ్యర్థి ఏసీ శన్‌ముగం గట్టి పోటీ ఇచ్చారు. ఇద్దరికీ నాలుగు లక్షలకు పైగా ఓట్లు పడ్డాయి. నువ్వానేనా అన్నట్టుగా రేస్ సాగింది. 20 రౌండ్లలోనూ కౌంటింగ్ ఉత్కంఠంగా సాగింది. వాస్తవానికి శన్‌ముగం న్యూ జస్టిస్ పార్టీ. కానీ అన్నాడీఎంకే బలపరిచిన అభ్యర్థిగా ఆయన పోటీలో నిలిచారు. డీఎంకే అభ్యర్థి కాథిర్‌కు 4 లక్షల 78 వేల 855 ఓట్లు పడగా.. అన్నాడీఎంకే అభ్యర్థికి 4 లక్షల 70 వేల 395 ఓట్లు పోలయ్యాయి. ఈ విక్టరీతో లోక్‌సభలో డీఎంకే ఎంపీల సంఖ్య 38 మందికి చేరుకున్నది. ఏప్రిల్ 18న జరగాల్సి ఎన్నికలను ఆరోపణలు రావడంతో వాయిదా వేశారు. ఈ ఏడాది ఆగస్టు 5వ తేదీన ఎన్నిక నిర్వహించారు.