ఈ అశోక పిల్లర్ నోట్ మీ ద‌గ్గ‌ర ఉందా మీకు డ‌బ్బే డ‌బ్బు

Do you have this Ashoka Pillar Note with you?

0

పాత క‌రెన్సీ క‌లెక్ట్ చేసేవారు మ‌న దేశంలో చాలా మంది ఉన్నారు. కొంద‌రు వీటిని పాష‌న్ కోసం క‌లెక్ట్ చేస్తారు. మ‌రికొంద‌రు ఇప్పుడు ఈ నాణాలు త‌క్కువ‌కి కొని, త‌ర్వాత అధిక ధ‌ర‌కు ఈ వెబ్ సైట్ల‌లో అమ్ముతారు. అయితే ఇప్పుడు పాత నోట్ల‌కు కాయిన్స్ కు విప‌రీత‌మైన డిమాండ్ ఉంది. 1970 కాయిన్స్ కూడా కొన్ని ఏకంగా ల‌క్ష‌ల ధ‌ర ప‌లుకుతున్నాయి.

అణాలు నాణాలు కాసులు ఇక వీటికి కూడా మంచి డిమాండ్ ఉంది. అయితే పాత నాణాలు కొన్ని ముద్ర‌లు ఉన్న‌వి మ‌రింత రేటు ప‌లుకుతున్నాయి. అయితే నోట్లు కూడా అంతే పాత క‌రెన్సీ నోట్ల‌కి వేల రూపాయ‌లు ఇచ్చేందుకు చాలా మంది సిద్దంగా ఉంటున్నారు.

దాదాపు ఏడాదిగా అశోక పిల్లర్ నోట్ కూడా డిమాండ్ ఉంది. ఈ నోట్లు బ్రిటిష్ కాలంలో భారతదేశంలో ముద్రించారు. బ్రిటీష్ వారు వెళ్లిన తరువాత కూడా అవి చాలా కాలం పాటు మన ప్రభుత్వాలు కూడా ముద్రించాయి. ఈనోటుని ఎలా గుర్తించాలి అంటే దీనికి మూడు ముఖాలతో సింహం ఆకారం ఉంటుంది. ఈ నోట్ 1943 సంవత్సరంలో జారీ చేయబడింది. ఈ నోటుకు మరొక వైపు ఒక పడవ ఉంటుంది. తరువాత ఈ నోట్ల ముద్రణ ఆగిపోయింది. కాని చాలా రేర్ గా మాత్ర‌మే ఈ నోట్లు దొరుకుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here