ఎఫ్‌3 మూవీ బడ్జెట్‌ ఎంతో తెలుసా?

0

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన లేటెస్ట్ మూవీ ఎఫ్ 3. ఈ సినిమాలో హీరోల సరసన తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటించారు. ఎఫ్ 2 పోయిన 2019 సంక్రాంతికి విడుదలైన ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఎఫ్ 2 మూవీ కి సీక్వెల్ గా ఈ సినిమాను అనిల్ రావిపూడి తెరెక్కిస్తున్నాడు.

ఎఫ్2 మూవీలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ తమదైన శైలిలో నటించి భారీ విజయాన్ని సాధించారు. దాంతో ఎఫ్ 3 కూడా తీయాలని నిర్ణయించినుకొని ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఈ సినిమా భారీ అంచనాలతో మే 27వ తేదీన విడుదలై ధీయేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాకు దిల్‌ రాజు 70 నుండి 80 కోట్ల వరకు ఖర్చుచేశాడు.

అందులో మెజార్టీ బడ్జెట్‌ పారితోషికాలకు ఖర్చు చేశారని తెలుస్తోంది. ఇక 30 కోట్లకు పైగానే నాన్ థియేట్రికల్‌ రైట్స్‌ అమ్ముడు పోయినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఈ సినిమా సక్సెస్ అయితే దిల్‌ రాజు మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. ఎఫ్ 2 కథకు ఎఫ్ 3 కథకు పూర్తి గా వ్యతిరేకత ఉన్నా కూడా మంచి హిట్ అందుకుంటుందని చిత్రబృందం అభిప్రాయపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here