ద‌స‌రాకు స‌మంత ఏం ప్ర‌క‌టించ‌బోతుందో తెలుసా..?

0

సమంత దసరా పండుగ సందర్భంగా కొత్త అప్‌డేట్స్ ఇవ్వబోతున్నట్టు న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవల నాగ చైతన్యతో ఆమె విడిపోతున్నట్టు ప్రకటించాక తెలుగులో మూవీస్‌కి సంబంధిచింది ఎలాంటి కొత్త అప్‌డేట్స్ ఇవ్వలేదు. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘శాకుంతలం’ మూవీని కంప్లీట్ చేసి చెన్నై వెళ్ళింది.

అక్కడ విజయ్ సేతుపతి, నయనతారలతో కలిసి ఓ మల్టీస్టారర్ మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అయితే విజయదశమి పండుగ సందర్భంగా అక్టోబర్ 15న సమంత నటించబోయే కొత్త ప్రాజెక్ట్స్‌కు సంబంధించిన అప్‌డేట్స్ ఇవ్వనున్నట్టు సమాచారం. ఆమె మూడు ప్రాజెక్ట్స్ కు కమిటయిందని టాక్. మరి ఆమె ఎన్ని ప్రాజెక్ట్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..అవి ఏభాషలో అనేది తెలియాలంటే మరొకొంత సమయం వేచి చూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here