కార్తీకదీపం సీరియల్ లో ప్రియమణి ఎవరో మీకు తెలుసా

Do you know who is Priyamani in Karthikadeepam serial

0

కార్తీకదీపం సీరియల్ ఎంత ఫేమస్సో తెలిసిందే. ఇందులో అన్నీ పాత్రలకు మంచి పేరు వచ్చింది. ఇటు దీప, డాక్టర్ బాబు, సౌందర్య, అలాగే మోనితతో పాటు ఇప్పుడు ప్రియమణి గురించి కూడా అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా ప్రియమణి మ్యాచింగ్ డ్రెస్సులు, జ్యూవెలరీ ఇటు అభిమానులకి బాగా నచ్చుతాయి. ఇక మోనిత కి ఆమె వేసే పంచ్ లు కూడా ఆకట్టుకుంటాయి సీరియల్ లో.

పైకి అమ్మగారండీ అంటూ మోనితను పొగుడుతూనే లోపల మాత్రం నానాశాపనార్థాలు పెట్టడం ప్రేక్షకులకు భలే గమ్మత్తుగా అనిపిస్తుంది. ఇలా పనిమనిషిగా ప్రియమణి పాత్ర బాగా పేరు వచ్చింది. ఆమె పేరు శ్రీ దివ్య. ఆమెకు చిన్నతనంలోనే వివాహం అయిందట.

2014లోనే సినిమా పరిశ్రమలోకి వచ్చానని చెబుతోంది. ఇక సీరియల్ చేయకముందు నేను వెబ్ సిరీస్ లో నటించాను. నేను పెద్ద హీరోయిన్ అవుదాము అనుకోలేదు చిన్న పాత్రలు చేస్తే చాలు అని వచ్చాను. పలు సినిమాలు చేశాను. కానీ ఎక్కడో ఓ ఫ్రేమ్ లో కనిపించేదాన్ని .కానీ కార్తీకదీపం సీరియల్ తో నాకు బాగా పేరు వచ్చింది అని ఆమె తెలిపింది. మహలక్ష్మి, రాములమ్మ సీరియల్లో నెగిటివ్ క్యారెక్టర్స్ చేశాను. ఇక పుష్ప చిత్రంలో కూడా ఆమె నటిస్తోందట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here