బాదం పప్పు ఎందుకు నానబెట్టి తినాలో తెలుసా?

Do you know why almonds are soaked and eaten?

0

ఉదయాన్నే లేచిన తర్వాత నాలుగు బాదం పప్పులు, నాలుగు వాల్‌నట్స్‌ తినటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని పౌష్టికాహార నిపుణులు చెబుతుంటారు. బాదంను నానబెట్టే ఎందుకు తినాలి? దాని ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదయాన్నే ఈ నట్స్‌ తినటం వల్ల హార్మోన్ల సమతౌల్యం బాగుంటుంది. మొత్తం రోజంతా అలసిపోకుండా ఉంటారు. వీటిని 8 నుంచి 10 గంటలు నానపెట్టడం వల్ల వాటిలో ఉండే పోషకాలు బయటకు పోవు. బాదంలో ప్రొటీన్‌, విటమిన్‌ ఈ, మెగ్నీషియం మొదలైనవి ఉంటాయి. వీటి వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది.

వాల్‌నట్స్‌లో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. వీటితో పాటుగా విటమిన్‌ ఈ, ఫోలిక్‌ యాసిడ్‌, ఫైబర్‌ కూడా ఉంటాయి. వాల్‌నట్స్‌ను క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది. బ్లడ్‌ షుగర్‌ను కూడా వాల్‌నట్స్‌ నియంత్రిస్తాయి. ప్రతిరోజు ఇవి తినండి ఆరోగ్యంగా ఉండండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here