గాడిదలకు ఉద్యోగాలు జీతం ఎంతో తెలిస్తే అవాక్కవుతారు

గాడిదలకు ఉద్యోగాలు జీతం ఎంతో తెలిస్తే అవాక్కవుతారు

0

వ్యాపారులు వస్తువులను మోయడానికి చాలా ఏళ్ల క్రితం గాడిదలని వాడేవారు, కాని ఇప్పుడు ఇలాంటి గాడిదలు జూలో మినహ బయట ఎక్కడా కనిపించడం లేదు.. బరువైన వస్తువులు ట్రావెలింగ్ కు గాడిదలు కాదు ఇప్పుడు వాహనాలు వచ్చేశాయి, ఇక వస్తువులు కూడా గాడిదలపై తీసుకువచ్చే రోజులు దాదాపు పోయాయి అనే చెప్పాలి.

గాడిద పాలతో అనేక రోగాలకు చెక్ పెట్టవచ్చననే వార్తల్ని చూస్తున్నాం. దీని వల్ల ఈ మధ్య కొందరు గాడిదలని తెచ్చి పెంచుకుంటున్నారు, ఈ పాలను అమ్ముతున్నారు, ఈ సమయంలో ఓ విచిత్ర వార్త వినిపిస్తోంది, అదేమిటి అంటే టర్కీలోని ఓ పట్టణంలో గాడిదలు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగాలే చేస్తున్నాయి.

మనుషులకే ఉద్యోగాలు లేవు మరి గాడిదలకు ఏకంగా సర్కారీ కొలువులు ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా,
టర్కీలోని ఓ మున్సిపాలిటీలో గాడిదలు ఉద్యోగాలు చేస్తున్నాయి.మార్డిన్ ప్రావిన్స్లో అర్తుక్లు అనే పట్టణం ఉంది. ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా ఇలా గాడిదలు ఉద్యోగం చేస్తున్నాయి, ఇక్కడ ఇళ్లు చాలా ఇరుకు సందుల్లో ఉంటాయి, అందుకే ఇక్కడ వాహానాలు వెళ్లవు, అందుకే గాడిదలనుపెట్టి ఆ ఇరుకు సందుల్లో నుంచి చెత్త సేకరిస్తున్నారు.

40 గాడిదలను చెత్త సేకరించే ఉద్యోగులుగా నియమించుకున్నారు. ఒక్కో గాడిద వెంట ఒక పారిశుద్ధ్య కార్మికుడు ఉంటాడు. అతడు చెత్తను తీసుకొని గాడిదపై ఉండే చెత్తసంచుల్లో వేస్తారు. ఇలా వెంటనే అవి నిండిన తర్వాత డంపింగ్ యార్డులో వేస్తాయి.
రోజుకు ఆరు గంటలు పనిచేస్తాయి. ఇవి షిఫ్ట్ పద్ధతిలో పనిచేస్తాయి. ఉదయం మూడు గంటలు, సాయంత్రం మూడు గంటలు
పనులు చేస్తాయి, ఇలా వీటి సర్వీసు ఏడేళ్లు ఉంటుంది. తర్వాత రిటైర్ అవుతాయి, నెలకి వాటికి జీతం రూపేణా ఒక్కోదానికి మన కరెన్సీలో 7 వేలు ఖర్చు చేస్తున్నారు, వీటిని నేరుగా అక్కడ అధికారులు కొంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here