దుబాయ్ నుంచి వ‌చ్చి 2 నెల‌లు అయింది ఇంత‌లోనే ఊహించ‌ని ప‌రిణామం

దుబాయ్ నుంచి వ‌చ్చి 2 నెల‌లు అయింది ఇంత‌లోనే ఊహించ‌ని ప‌రిణామం

0

ఆ వ్య‌క్తి పేరు డేవిడ్.. దుబాయ్ నుంచి వ‌చ్చాడు… అక్క‌డ క‌రోనా తీవ్ర‌త పెర‌గ‌క‌ముందే ఇక్క‌డ ఇండియాకి వ‌చ్చాడు, చిన్న‌త‌నం నుంచి చ‌దువు స‌రిగ్గా రాక‌పోవ‌డంతో 7 తోనే చ‌దువు ఆపేశాడు. వెల్డింగ్ వ‌ర్క్ లో పెద్ద ప్రావీణ్యం సంపాదించాడు, అయితే దాదాపు 10 ఏళ్లుగా దుబాయ్ లోనే ఉంటున్నాడు, నెల‌కి సంపాదించిన దానిలో 20 శాతం ఖ‌ర్చు చేసి 80 శాతం ఇంటికి పంపాడు.

ఇలా 20 ల‌క్ష‌ల‌లో ఇళ్లు క‌ట్టాడు, అంతేకాదు త‌న గారాల చెల్లి పెళ్లి చేశాడు, ఇక ఈ ఏడాది డేవిడ్ కి పెళ్లి చేద్దాం అనుకుని ఫ్రిబ్ర‌వ‌రిలో అత‌నిని ఇండియాకి ర‌మ్మ‌న్నారు, ఈ స‌మ‌యంలో ఎంతో మంచి మ‌న‌సు ఉండ‌టం క‌ష్టాన్ని న‌మ్ముకున్న ఆ వ్య‌క్తి క‌రోనాతో ఇబ్బంది ప‌డుతున్న పేద‌ల‌కు త‌న ద‌గ్గ‌ర ఉన్న న‌గ‌దుతో సాయం చేస్తున్నాడు.

దాదాపు ల‌క్ష రూపాయ‌ల వ‌ర‌కూ ఇలా కూర‌గాయ‌లు నిత్య అవ‌స‌ర వ‌స్తువులు రోజుకి 50 కుటుంబాల‌కి సాయం చేస్తున్నాడు.. మిగిలిన మిత్రుల సాయంతో ఇలా రోజూ సాయం అందిస్తున్నాడు, అయితే ఉద‌యం కూర‌గాయ‌ల మార్కెట్ కు వెళుతున్న స‌మ‌యంలో తెల్ల‌వారుజామున 4 గంట‌ల‌కు బైక్ క‌ల్వ‌ర్ట్ పై నుంచి ప‌డింది, అత‌ను అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయాడు, ఈ దారుణ‌మైన ఘ‌ట‌న అంద‌రిని క‌ల‌వ‌ర‌ప‌రిచింది.దీంతో త‌ల్లిదండ్రులు క‌న్నీరు మున్నీరు అవుతున్నారు.