ఇద్దరు దర్శకుల సినిమాల్లో వెంకీ ఏది ఒకే చేస్తారో

ఇద్దరు దర్శకుల సినిమాల్లో వెంకీ ఏది ఒకే చేస్తారో

0

వెంకటేష్ సినిమాల జోరు పెంచారు అనే చెప్పాలి.. తాజాగా ఆయన వెంకీ మామ సినిమాతో నేడు వచ్చారు.. అయితే పూర్తి వినోధ భరితంగా ఈ సినిమా వస్తోంది, అయితే తరువాత వెంకీ అసురన్ సినిమాలో చేస్తున్నారు ఇది తనకు 74 వ సినిమా అవుతుంది. తర్వాత వెంకీ ఏ సినిమా చేస్తారు అంటే ఆయన మల్లీ స్టారర్ చేసే అవకాశాలు ఉన్నాయి అని, నేచురల్ స్టార్ నాని ఆయన కలిసి మల్టీ స్టారర్ అని వార్తలు వినిపించాయి.

అయితే తాజాగా వెంకీ 75 వ చిత్రం పై వార్త వినిపిస్తోంది టాలీవుల్ లో… గతంలో తరుణ్ భాస్కర్ వినిపించిన ఒక కథకి వెంకటేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందుకే ఆయన 75వ సినిమా తరుణ్ భాస్కర్ తోనే ఉండొచ్చునని కొందరు అంటున్నారు. అయితే ఆయన ఎఫ్ 3 కూడా చేసేందుకు సిద్దం అవుతున్నాడు మరి ఆయన ఎఫ్ 3 చేస్తారా లేదా తరుణ్ తో సినిమా చేస్తారా అనేది చూడాలి.

అయితే 75 వ సినిమా కాబట్టి ఈ సినిమా ఆశలు ఉంటాయి కాబట్టి ఆ ఇద్దరు దర్శకులతో చర్చించి ముందు ఏది పట్టాలెక్కిస్తారో చూడాలి.. తాజాగా వెంకటేశ్ 74వ చిత్రంగా ‘అసురన్’ రీమేక్ సెట్స్ పైకి వెళ్లనుంది. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఈ సినిమాను నిర్మించడానికి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి వెంకీ మామ చేస్తున్న సమయంలోనే ఈ సినిమాపై అప్ డేట్ వచ్చిన విషయం తెలిసిందే.