ఇక అలాంటి కథలే చేస్తుందా అనుష్క – వాటికి ఫుల్ స్టాపా

ఇక అలాంటి కథలే చేస్తుందా అనుష్క - వాటికి ఫుల్ స్టాపా

0

అనుష్క స్వీటీ తన సినిమాలతో నటనతో కుర్రకారుని ఆకట్టుకున్న బ్యూటీ మంచి హిట్ పెయిర్ అనే పేరు కూడా పలువురు హీరోల పక్కన సంపాదించుకుంది జేజమ్మగా.. తన కెరియర్ పీక్స్ కు అక్కడ నుంచి వెళ్లింది.. తర్వాత బాహుబలితో సూపర్ సక్సెస్ సంపాదించుకుంది..

తాజాగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు మార్కెట్ ఉంటోంది.. తాజాగా నయనతార ఈ సినిమాల్లో దూసుకుపోతోంది, ఇఫ్పుడు తాజాగా అనుష్క పేరు కూడా వినిపిస్తోంది. బాహుబ‌లి సీరిస్ తర్వాత ఆమె చేసిన సినిమా నిశ్శ‌బ్ధం విడుద‌ల‌కు రెడీ అవుతూ ఉంది. ఇక అనుష్క త‌దుప‌రి సినిమా కూడా ఒక థ్రిల్ల‌రే అని తెలుస్తోంది. భాగమతి కూడా అలాంటి సక్సస్ ను ఇచ్చిన విషయం తెలిసిందే.

గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌కత్వంలో ఈ సినిమా రూపొందనుంద‌ట‌. బాహుబ‌లి సీరిస్ సినిమాల త‌ర్వాత ఇత‌ర హీరోల సినిమాల్లో దేనికీ అనుష్క సైన్ చేసిన‌ట్టుగా వార్తలు రాలేదు.. అందుకే ఇలాంటి కథలను సెలక్ట్ చేసుకుంటోంది అంటున్నారు స్వీటి అభిమానులు.