ఇక్కడ అడ్డు అదుపులేకుండా నాటు సారా అమ్మకం…

ఇక్కడ అడ్డు అదుపులేకుండా నాటు సారా అమ్మకం...

0

ఏపీలో పలు గ్రామాల్లో నాటు సారా ఏరులై పారుతోంది… అధికారులు నిరంతరం నిఘా ఏర్పాటు చేసినా కూడా కొత్త దారుల్లో సారా మద్యం ప్రియుల చెంతకు చేరుతోంది…

గతంలో లీటరు 60 రూపాయలు ధర కల్గిన నాటు సారా కరోనా వైరస్ ప్రభావంతో 450 రూపాయలు అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారు కొందరు… అనంతపురం జిల్లా పామిడి మండలం రామగిరి దిగువ తండాలో చుట్టు పరిసర ప్రాంతాలు అటవీ ప్రాంతం కావడంతో అక్కడ నాటు సారా వ్యాపారులకు స్వర్గదాయకంగా మారింది…

దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు… కరోనా వైరస్ ను కంట్రోల్ కావచ్చుకానీ నాటు సారా అదుపు చేయడం పోలీసుల తరం కాదని అంటున్నారు…