బాంబు పేల్చినా హీరోయిన్.. రాత్రి గడపాలాన్నాడట..!!

బాంబు పేల్చినా హీరోయిన్.. రాత్రి గడపాలాన్నాడట..!!

0

ఇటీవలే కాస్టింగ్ కౌచ్ లో ఇరుక్కున్న హీరోయిన్స్ రోజు రోజు కి ఎక్కువవుతున్న సంగతి తెలిసిందే.. తాజగా మోడల్‌, బాలీవుడ్ నటి ఎల్లీ అవ్రామ్‌ కూడా ఈ లిస్ట్ లో చేరింది.. తాజాగా ఆమె మహిళలపై జరుగుతున్న వేధింపుల గురించి మాట్లాడుతూ తొలినాళ్లలో తనకు ఎదురైన చేదు సంఘటనలను పంచుకున్నారు.

ఆఫర్స్ కోసం తిరిగే టైం లో నాకు వేధింపులు కూడా ఎదురయ్యాయి. ఆఫర్ల కోసం కొన్ని మీటింగ్స్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఇద్దరు దర్శకులు నాకు షేక్‌హ్యాండ్‌ ఇచ్చి… వారి వేలితో గోకారు. తొలి మీటింగ్‌ తర్వాత దీని గురించి నా స్నేహితుడ్ని అడిగా. అతడు షాక్‌ అయ్యాడు.

‘వాళ్లు నీతో అలా ప్రవర్తించారా? దాని అర్థం నీకు తెలుసా?’ అన్నాడు. నాకు తెలియదని చెప్పా. వాళ్లు తమతో నిన్ను ఓ రాత్రి గడపమని అంటున్నారని చెప్పాడు. చిత్ర పరిశ్రమలో రాణించడం చాలా కష్టం. ఓ పెద్ద ప్రాజెక్టుకు నన్ను తీసుకోవాలి అనుకున్నారు. కానీ అక్కడ కూడా ఇలాంటి సమస్య వచ్చింది. దీంతో నటుడికి నాతో సమస్య ఏర్పడి, మరో నటిని తీసుకున్నారు. నన్ను తొలగించారు. నిర్మాత కాల్‌ చేసి నాకు ఆ మాట చెప్పినప్పుడు చాలా బాధపడ్డా’ అని ఆమె అన్నారు.