టీకా వేయకుండా ఖాళీ సిరంజీ గుచ్చింది – వైరల్ వీడియో

Empty syringe pierced without vaccination - viral video

0

దేశ వ్యాప్తంగా 18 సంవత్సరాలకు పైబడిన వాళ్లందరికీ కోవిడ్-19 వ్యాక్సిన్ వేస్తున్న సంగతి తెలిసిందే. కోట్లాది మంది వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో వైద్య సిబ్బంది ఎంతో కష్టపడుతున్నారు. ప్రతీ ఒక్కరికి జాగ్రత్తగా టీకా వేస్తున్నారు, అయితే మరికొందరు వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా ఉండటం వల్ల టీకాలు వేస్ట్ అవ్వడంతో పాటు వారికి టీకా వేయకుండా టీకా వేసినట్లు కూడా లెక్కిస్తున్నారు.

తాజాగా ఓ వ్యక్తికి ఎంప్టీ డోస్ను ఇచ్చిన నర్సు వీడియో వెలుగులోకి వచ్చింది. బీహార్లోని చప్రా జిల్లాలో జూన్ 21న ఈ సంఘటన జరిగింది. ఓ నర్సు కొవిడ్ వ్యాక్సిన్లు వేస్తూ పక్క వారి ప్రశ్నలకు సమాధానం ఇస్తోంది. ఈ సమయంలో కొత్త సిరంజీ తీసుకుంది. కాని అందులో వయల్ నుంచి టీకా తీసుకోలేదు. ఆ ఇంజెక్షన్ తీసి నేరుగా అతని చేతికి చేసింది.

డైరెక్ట్గా ఆ వ్యక్తికి వ్యాక్సిన్ వేసినట్లుగా సిరంజీ గుచ్చింది.అది ఎంప్టీ డోస్. అయితే టీకా వేస్తున్న సమయంలో సదరు వ్యక్తి స్నేహితుడు వీడియోను తీశాడు. తర్వాత వీడియోలో చూస్తే ఆమె టీకా వేయలేదు అని తెలుసుకున్నారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నర్సు చందా కుమారిని వెంటనే విధుల నుంచి తొలగించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here