ఎన్ కౌంటర్ చేసిన పోలీసులకు ఎన్ని కష్టాలో తెలుసా

ఎన్ కౌంటర్ చేసిన పోలీసులకు ఎన్ని కష్టాలో తెలుసా

0

ఎన్ కౌంటర్ చేసిన పోలీసులకు కొన్ని సార్లు చుక్కలు కనిపిస్తాయి.. తాజాగా ఇలాంటి కేసులు పలు స్టేట్స్ లో పోలీసుల మెడకు చుట్టుకుంటున్నాయి. ఎన్ కౌంటర్ చేసిన తర్వాత ఖాకీలకు ఎదురయ్యే ఇబ్బందులు చాలానే ఉంటాయి ఇప్పుడు దిష కేసులో ఇదే తాజాగా కనిపిస్తోంది. ఇలా ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై సెక్షన్ 302 కింద హత్యానేరం నమోదవుతుంది. నిబంధనల మేరకు ప్రభుత్వం నుంచి గానీ… పోలీసు శాఖ నుంచి గానీ వారికి న్యాయసాయం అందదు. రిటైర్డ్ అయినా ఈ కేసులు వెంటాడుతాయి

అలాగే కోర్టు ఖర్చులు లాయర్ ఖర్చులు కూడా వారే భరించాల్సి ఉంటుంది. కేసును పర్యవేక్షించే అధికారులకు కూడా వ్యక్తిగతంగా ఇబ్బందులుంటాయి. పర్యవేక్షించే అధికారులకు కూడా కేసు తేలే వరకు పదవీ విరమణ ప్రయోజనాలు అందవు..మరి ఇలాంటి కేసుల్లో పోలీసులకి కూడా శిక్షలు పడుతాయి….సెక్షన్ 100 కింది మీరు ప్రాణాలు కాపాడుకోవచ్చు.

పోలీసులు తాము అదే చేశాము అని చెబుతారు.. పోలీసులు ముందు నిందితులని వార్న్ చేయాలి, అయితే ఇలా చంపితే కుదరదు. పోలీసులు చట్టాలు రాజ్యాంగం పాటించనట్లే వస్తుంది. పైనుంచి ఆర్డర్ వచ్చాయి అని చెప్పినా ఎఫ్ ఐ ఆర్ లో ఆపోలీస్ పేరు నమోదు అవుతుంది.. అలాగే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తారు. ఒకవేళ అది ఫేక్ ఎన్ కౌంటర్ అని నిర్ధారణ అయితే ఉరిశిక్ష కూడా పడే అవకాశం ఉంది. తాజాగా ఈ విషయాలని సీనియర్ లాయర్ తెలియచేశారు. ఇలాంటి కేసుల్లో జైలులో ఇంకా శిక్ష అనుభవిస్తున్న పోలీసులు కూడా ఉన్నారని తెలియచేశారు ఆయన.