ఎట్టి పరిస్థితిలో ఆ టీడీపీ ఎమ్మెల్యేను వైసీపీలో చేర్చుకునేదిలేదు… విజయసాయిరెడ్డి

ఎట్టి పరిస్థితిలో ఆ టీడీపీ ఎమ్మెల్యేను వైసీపీలో చేర్చుకునేదిలేదు... విజయసాయిరెడ్డి

0

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు… రాష్ట్రంలో కరోనా వైరస్ ను అంతమొందించేందుకు అనేక చర్యలు తీసుకుంటుంటే టీడీపీ నాయకులు మాత్రం రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు… తాజాగా విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ… వైజాగ్ లో కరోనా కేసులు దాచి ఉంచారని టీడీపీ నాయకులు అంటున్నారని అన్నారు…

అయితే తాము కరోనా కేసులు దాచి ఉంచినట్లు టీడీపీ నాయకులు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని విజయసాయిరెడ్డి సవాల్ విసిరారు.. నిరూపించలేని పక్షంలో చంద్రబాబు నాయుడు రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని ఆయన అన్నారు…

కరోనా కేసులు దాచి ఉంచాల్సిన పని ఏముందని అన్నారు… అలాగే మాజీ మంత్రి గంటా వైసీపీలో చేరికపై కూడా విజయసాయిరెడ్డి స్పందించారు… గంటా శ్రీనివాసరావు నమ్మదగ్గ మనిషి కాదని అన్నారు… ఎట్టి పరిస్థితిల్లో ఆయన్ను పార్టీలో చేర్చుకునే పరిస్థితిలేదని స్పష్టం చేశారు… కాగా కొద్దికాలంగా గంటా శ్రీనివాసరావు పార్టీ మారుతారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే…