ఆకట్టుకుంటున్న “ఎవరికీ చెప్పొద్దు” ట్రైలర్..!!

ఆకట్టుకుంటున్న "ఎవరికీ చెప్పొద్దు" ట్రైలర్..!!

0
Rakesh Varre, Gargeyi Yellapragada in Evvarikee Cheppoddu Movie Stills

ఈ మధ్య చిన్న సినిమాలు పెద్ద సినిమా లతో పోటీ పడి మరీ హిట్ అవుతున్నాయి.. అలా ఇటీవల ప్రేక్షకులు మెచ్చిన సినిమా “ఎవరికీ చెప్పొద్దు” .. బసవ శంకర్ దర్శకత్వంలో వస్తున్న రాకేశ్ .. గార్గేయి ఈ సినిమాలో నాయకా నాయికలుగా కనిపించనున్నారు.

అయితే హీరోగా చేస్తోన్న రాకేశ్ ఈ సినిమాకి నిర్మాతగానూ వ్యవహరిస్తుండటం విశేషం. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను విడుదల చేశారు. ప్రేమ – కులం అనే అంశాల చుట్టూ ఈ కథాంశం తిరుగుతుందనే విషయం ఈ ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఎవరికి వారు తమకి తెలిసిన సీక్రెట్ ను మరొకరితో చెప్పి, ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ అంటూ వుంటారు. ఆ డైలాగ్ పైన .. ‘మీ క్యాస్ట్ ఏంటి? అనే డైలాగ్ పైన ఈ ట్రైలర్ ను కట్ చేశారు.