ఉత్కంఠం రేపుతున్న ‘ఎవరు’ ట్రైలర్ ..!

ఉత్కంఠం రేపుతున్న 'ఎవరు' ట్రైలర్ ..!

0

అడివి శేష్ కథానాయకుడిగా రెజీనా కథానాయకగా వెంకట్ రాంజీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎవరు’. ఈ చిత్రం ఆగష్టు 15న స్వాతంత్ర్యదినోత్సవం సందర్బంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలోనే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ పనులను శరవేగంగా జరుపుకుంటుది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, పాటలు ఇప్పటికే విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

అయితే ఈ చిత్ర టీజర్ ని సమంత విడుదల చెయ్యగా ట్రైలర్ ని మరో స్టార్ విడుదల చేశారు. ఆ స్టార్ ఎవరు అని అనుకుంటున్నారా ..ఇంకెవరండీ మన న్యాచురల్ స్టార్, ప్రస్తుతం గ్యాంగ్ లీడర్ నాని ఈ సినిమా టీజర్ ని ట్విట్టర్ వేధికగా విడుదల చేశారు. నాని ట్విట్ చేస్తూ ‘ఎవరు సినిమా టీంకి శుభాకాంక్షలు. ఈ సినిమా బారి విజయాన్ని సాధించాలని ఆశిస్తున్నాను. ఈ సినిమా చూడటం కోసం నేను వెయిట్ చేస్తున్నను’ అంటూ ట్విట్ చేసారు. ‘ఎంత ఇస్తావ్ .. ఎంత ఇవ్వాలి సర్’ అంటూ ట్రైలర్ మొదలవుతుంది. ట్రైలర్ లో ఉన్న సన్నివేశాలు ఉత్కంఠం రేపుతున్నాయి.

అయితే టీజర్ లో చూసినట్టు అడివి శేష్ ని నిజాయితీ పోలీస్ ఆఫీసర్ లా కాకుండా ‘కరప్టెడ్ పోలీస్ ఆఫిసర్’గా ఈ సినిమాలో ప్రేక్షకులకు కనిపించనున్నారు. ఈ సినిమా ట్రైలర్ మొత్తం సస్పెన్స్ తో కుడి ఉంది. కాగా ఈ సినిమాలో కీలక పాత్రను నవీన్ చంద్ర పోషిస్తున్నారు. క్షణం, గూఢచారి వంటి విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే అడవి శేష్ ఈ సినిమాతో కూడా అలానే ఆకట్టుకుంటాడా అనేది చూడాలి.