రోషం ఉందా? : మంత్రి హరీష్ కు ఈటల స్ట్రాంగ్ కౌంటర్

etala rajendar vs harish rao harish vs etala

0

 

మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన నియోజకవర్గం హుజూరాబాద్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానికంగా తనకున్న పరిచయస్తులను కలుసుకుంటున్నారు. ఇప్పటికే కొందరు టిఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. మిగతావారిని తనతోనే ఉండేలా కసరత్తు చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఈటలపై చేసిన కామెంట్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

టిఆర్ఎస్ పార్టీలో తనకంటే ఎక్కువగా మంత్రి హరీష్ రావు అవమానాలపాలయ్యారని ఇటీవల ఒకసారి మాజీ మంత్రి ఈటల కామెంట్ చేశారు. కేసిఆర్ కు, హరీష్ రావుకు మధ్య కూడా పెద్ద గ్యాప్ ఉందన్నారు. ఈటల చేసిన ఈ కామెంట్స్ కు హరీష్ రావు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఈటల తన భుజాల మీద తుపాకీ పెట్టి కాల్చాలనుకుంటున్నారని, తాను చెడ్డ కోతి వనమంతా చెరిచిందన్నట్లు ఈటల మాట్లాడుతున్నారని సమాధానమిచ్చారు. ఈటల మాటలు భావ దారిద్ర్యంతో చేస్తున్నారే తప్ప మరోటి కాదన్నారు హరీష్.

అయితే హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఈటల రాజేందర్ అంతే స్థాయిలో హరీష్ కు రిప్లై ఇచ్చారు. నిజంగా హరీష్ రావుకు ఆత్మగౌరవం, రోషం ఉందా అని సూటిగా ప్రశ్నించారు. భావ దారిద్ర్యం ఆయనదా… లేక నాదా అనే విషయాన్ని హరీష్ రావునే అడగాలంటూ మీడియాకు సమాధానమిచ్చారు ఈటల.

మొత్తానికి పాత దోస్తులంతా ఒక్కొక్కరుగా ఈటల రాజేందర్ కు దూరమవుతన్నట్లు కనబడుతున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here