వైసీపీకి గ్రీస్ సిగ్నల్ ఇచ్చిన ముద్రగడ

0

ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎంపీ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు… ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి లేఖ కూడా రాశారు… ఆ లేఖలోని సారంశం… ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బందితో బాధపడుతున్నారు…

వెంటనే వారిని ఆదుకోవాలని ముద్రగడ కోరారు… జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో కొత్త ఇసుక పాలసీ తీసుకు రావడం మంచిదేనని అన్నారు… అంతేకాదు అవసరమైనంత మేరకు ఇసుకను ఫ్రీగా ఇవ్వాలని ఆయన కోరారు… ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక కొరత ఎక్కువగా ఉందని అన్నారు.

ఇలాంటి సమయాల్లో ఇసుకను ఫ్రీగా పంపిణీ చేయాలని అన్నారు… జగన్ కొత్త పథకాలను ఇచ్చేందుకు తాపత్రాయపడుతున్నారన్న ముద్రగడ ఆ తాపత్రాయం కాపులమీద చూపాలని అన్నారు… ఇసుక కొరతవల్ల భవన నార్మాణ కార్మికులు ఎంత ఇబ్బందులు పడుతున్నారు తాము కూడా అంతే ఇబ్బందులు పడుతున్నామని అన్నారు…