తిరుపతి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం

0

తిరుపతి వెళ్తుండగా జరిగిన ఓ ప్రమాదం కుటుంబాన్ని మింగేసింది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పల్నాడు జిల్లాలోని మాచర్ల నుంచి సిరిగిరిపాడు వాసులు తిరుపతికి వెళ్తున్నారు. ఈ క్రమంలో కంభం సమీపంలోకి రాగా వారు ప్రయాణిస్తున్న కారు లారీని వెనకనుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో అనిమిరెడ్డి (60), గురవమ్మ (60), అనంతమ్మ (55),ఆదిలక్ష్మి (58), నాగిరెడ్డి (24) ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here