పెదాలు నల్లగా ఉన్నాయా? అయితే ఇలా చేయండి..

0

సాధారణంగా అందరు అందంగా ఉండాలని కోరుకుంటారు. ముఖ్యంగా మహిళలు అందంగా ఉండడం కోసం వివిధ రకాల చిట్కాలు పాటిస్తూ విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. మహిళల అందాన్ని పెంచడంలో పెదాలకు ఎంతటి ఆవశ్యకత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ మనలో చాలామంది పెదాలు నల్లగా ఉన్నాయని బాధపడుతుంటారు. అలాంటి వారి కోసమే ఈ సింపుల్ చిట్కాలు..

పెదాలు అందాన్ని మరింతగా మెలుగుపరచుకోవాలంటే మొదటగా గులాబీ రేకుల్ని ముద్దగా చేసుకుని అందులో చెంచా వెన్న కలుపుకోవాలి. ఈ మిశ్రమానికి రెండు చుక్కల బాదం నూనె చేర్చి పెదాలకు రాసుకుంటే మృదువుగా కనిపిస్తాయి. ఇలా తరచు చేయడం వల్ల పెదాల నలుపుదనం తొలగిపోయి గులాబీరేకుల్లా ఎర్రగా మారతాయి.

ఇంకా తేనె, పంచదార ఆలివ్‌నూనెల మిశ్రమాన్ని పెదాలకు రాసి మృదువుగా రుద్దితే మృతకణాలు తొలగిపోవడంతో పాటు పెదాల నలుపుదనం క్రమక్రమంగా తగ్గుముఖం పడుతుంది. అంతేకాకుండా రోజూ రాత్రి పడుకునే ముందు పెదాలకు తేనె రాసి మెత్తని బ్రష్‌తో మృదువుగా రుద్దడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here