హోరెత్తనున్న ప్లిప్ కార్డు ఆఫర్లు..

హోరెత్తనున్న ప్లిప్ కార్డు ఆఫర్లు..

0

ఆన్లైన్ దిగ్గజం ప్లిప్ కార్డు ప్రణాళికలు రచిస్తోంది. ఆఫర్లు, డిస్కౌంట్ల తో వినియోగ దారులను ఆకట్టుకునేందుకు సిద్ధం అవుతుంది. రానున్న దీపావళి, దసరా, క్రిస్ మస్ సీజన్ ల బిగ్ బిలియన్ డేస్ సేల్స్ లో రెట్టింపు అమ్మకారణూ సాధించాలని టార్గెట్ పెట్టుకుంది. దీనికోసం సోషల్ మీడియాను వాడుకోనుంది.

ముఖ్యంగా కంపెనీ ప్రధాన బ్రాండ్లు, స్మార్టు ఫోన్లు ఎలక్ట్రానిక్స్ విభాగాలలో నూతన ఓవరవడి తేనుంది. ప్రీ-ఆర్డర్‌లు, 50 – 70 శాతం డిస్కౌంట్ ప్రకటించనుంది. అత్యుత్తమ ప్రమాణాలతో వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రణాళిక ఉందని బ్రాండ్లకు పంపిన ఇమెయిల్ లో ప్లిప్ కార్డు తెలిపింది. ఈ సందర్భాంగా ప్లిప్ కార్డు ప్రతినిధులు మాట్లాడుతూ భారతీయ వినియోగ దారులకు విలువైన ఉత్పత్తులను అందించాలనే లక్ష్యంతోనే ముందుకు వెళ్తున్నామని ప్లిప్ కార్డు కార్పొరేట్ అధికారి రజనీష్ కుమార్ తెలిపారు.