మాజీ మంత్రిపై మరో కేసు నమోదు..కారణం ఇదే?

0

ఇటీవలే విశాఖ పట్నం జిల్లా నర్సీ పట్నం మరిడి మాంబ ఉత్సవాల సందర్భంగా పోలీసులను ఉద్దేశించిన మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలను పోలీసులు తీవ్రంగా కండించి అతనిపై కేసు నమోదు చేశారు. ఇంకా ఆ విషయం మరవకముందే తాజాగా అయ్యన్నపాత్రుడిపై మరో కేసు నమోదయింది.

అనకాపల్లి జిల్లా చోడవరంలో నిర్వహించిన మినీ మాహానాడులో ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రతిష్ఠను దిగజార్చేలా మాట్లాడారు. ఈ సందర్భంగా ఏయూ జేఏసీ ఆయనపై విశాఖపట్టణం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేయగా..పోలీసులు 41ఎ సెక్షన్ కింద గత రాత్రి నోటీసులు ఇవ్వడానికి వాళ్ళింటికి వెళ్లారు. కానీ ఆ సమయంలో అయ్యన్న లేకపోవడంతో పోలీసులు వెనక్కి వచ్చినట్టు త్రీ టౌన్‌ సీఐ రామారావు తెలిపారు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here