4 ఏళ్ల పిల్లాడి క‌డుపులో ఏముందో చూసి షాకైన డాక్ట‌ర్స్

4 ఏళ్ల పిల్లాడి క‌డుపులో ఏముందో చూసి షాకైన డాక్ట‌ర్స్

0

చిన్న‌పిల్లలు ఏది ప‌ట్టుకున్నా జాగ్ర‌త్త‌గా అబ్జ‌ర్వ్ చేయాలి… లేక‌పోతే వారు తెలియ‌క వాటిని నోట్లో పెట్టేసుకుంటారు. ఏ మాత్రం అజాగ్ర‌త్త‌గా ఉన్నా అవి వారి నోటిలోకి వెళ‌తాయి.. త‌ర్వాత స‌ర్జ‌రీలు జ‌రిగే ప్ర‌మాదం ఉంటుంది, తాజాగా జానీ అనే బాలుడు అదే చేశాడు ఆబాలుడి త‌ల్లి త‌ల‌లో మ‌ల్లెపూలు పెట్టుకుంది.. ఆ స‌మ‌యంలో పిన్నీసు తీసి విరిగింది క‌దా అని కింద పడేసింది.

దానిని కొన‌తీసేసి ఆ పిన్ను నోట్లో పెట్టుకుని ఆడుకున్నాడు ఆ బాలుడు.. అది తిన్నా వెంట‌నే అత‌ను ఊపిరి ఆడ‌టం లేదు అని గోల పెట్టాడు, వెంట‌నే నీరు తాగించ‌డంతో అది క‌డుపులోకి వెళ్లింది. కాని కొద్ది రోజుల‌కి అత‌నికి ఆ పిన్నీసు క‌డుపులోకి వెళ్ల‌డంతో క‌డుపు నొప్పి మొద‌లైంది.

అంతేకాదు శ‌రీర అవ‌య‌వాల‌కు కాస్త దెబ్బ‌తినేలా చేసింది, వెంట‌నే స్కాన్ చేసి చూసిన డాక్ట‌ర్లు లోప‌ల పిన్నీసు ఉంది అని తెలిసి, అది తొల‌గించారు, దీనిని ప్ర‌తీ తల్లితండ్రి తెలుసుకోవాల‌ని జాగ్ర‌త్త వహించాలి అని స్ధానిక మీడియా ద్వారా అంద‌రికి తెలిసేలా పిల్ల‌ల విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలి అని చెప్పారు.