40 రోజుల త‌ర్వాత తెలంగాణ‌లో తొలి రైలు స్టార్ట్ అయింది

40 రోజుల త‌ర్వాత తెలంగాణ‌లో తొలి రైలు స్టార్ట్ అయింది

0

ఈ వైరస్ క‌ట్ట‌డికి ప్ర‌భుత్వం లాక్ డౌన్ విధించింది, తాజాగా కేంద్రం వ‌ల‌స కూలీలు , కార్మికులు విద్యార్దులు, టూరిస్టులు వేరే ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి త‌మ సొంత గ్రామాల‌కు వెళ్లేందుకు అవ‌కాశం ఇచ్చింది , ఆయా రాష్ట్రాలు వారిని తీసుకువెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకోవాలి అని తెలిపింది, నోడ‌ల్ అధికారిని ఏర్పాటు చేసుకోవాలి అని కోరింది.

అయితే ఏపీలో గుజ‌రాత్ నుంచి 4000 మంది మ‌త్య‌కారుల‌ని తీసుకువ‌చ్చారు బ‌స్సుల్లో, అయితే చాలా రాష్ట్రాలు వ‌ల‌స కూలీల‌ను తీసుకువ‌చ్చేందుకు రైలు సౌక‌ర్యం క‌ల్పించాలి అని కోరాయి, దీంతో కేంద్రం దీనికి కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

తెలంగాణలోని వలస కూలీలను తరలించేందుకు లింగపల్లి నుంచి జార్ఖండ్‌లోని హతియా వరకు ప్రత్యేక రైలు నడపనుంది. 24 బోగిలతో కూడిన ఈ రైలు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు బయలుదేరనుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక విజ్ఞప్తి మేరకు కేంద్రం ఈ రైలు నడిపేందుకు అనుమతించింది, ఇక ఇక్క‌డ నుంచి వ‌ల‌స కూలీల‌ను సుమారు 500 మందిని అక్క‌డ‌కు త‌ర‌లిచేందుకు ఈ ట్రైన్ లో ముందు వారిని పంప‌నున్నారు.