ప్రాంక్ చేసి అడ్డంగా బుక్క‌య్యాడు ఏమైందంటే ?

ప్రాంక్ చేసి అడ్డంగా బుక్క‌య్యాడు ఏమైందంటే ?

0

అస‌లే క‌రోనా కాలం ఎవ‌రిని బ‌య‌ట‌కు రావద్దు అని పోలీసులు చెబుతూనే ఉన్నారు, ఈ స‌మ‌యంలో బ‌య‌ట‌కు ప‌నిలేకుండా వ‌స్తే వారి బైక్ కార్లు సీజ్ చేస్తున్నారు, అంతేకాదు కేసులు న‌మోదు చేస్తున్నారు, ఈ స‌మ‌యంలో ఓ వ్య‌క్తి ప్రాంక్ చేసి అడ్డంగా బుక్క‌య్యాడు, అలా ఇలా కాదు అత‌నికి దారుణ‌మైన షాక్ ఇచ్చాడు ఓ వ్య‌క్తి.

ఓ ప్రాంక‌ర్ ఇలా పాల బూత్ ద‌గ్గ‌ర ప్రాంక్ చేద్దాము అని రెడీ అయ్యాడు, పాలు కొని ఇంటికి వెళుతున్న వారి ప‌క్క నుంచి వెళుతూ తుమ్ముతూ యాక్ట్ చేశాడు, ఇక ఇద్ద‌రు పెద్ద ప‌ట్టించుకోలేదు.. తిట్టి వెళ్లిపోయారు, ఇక మూడో వ్య‌క్తి పాలు తీసుకుని వెళుతున్నాడు,

ఈ స‌మ‌యంలో అత‌ని ప‌క్క‌నుంచి వెళ్లి తుమ్మాడు, సారి చెప్పి ముందుకు వెళ్లాడు, మ‌ళ్లీ ప‌క్క నుంచి వ‌చ్చి తుమ్మాడు… దీంతో అత‌నికి కోపం వ‌చ్చింది ..వెంట‌నే చెంపపై కొట్టాడు, అంతే సార్ ఇది ప్రాంక్ అని చెప్పాడు, దీంతో అత‌నికి ఇంకా కోపం వ‌చ్చింది, వెంట‌నే అక్క‌డ దూరంగా వ్యానులో ఉన్న కెమెరా ప‌గ‌ల‌గొట్టాడు, నీ ప్రాంక్ ఈ స‌మ‌యంలో చేస్తావా నీ దిక్కు ఉన్న చోట చెప్పుకో అని వెళ్లిపోయాడు, ఆయ‌న ఆర్మీలో పెద్ద ఆఫీస‌ర్ అట, చివ‌ర‌కు ఆ ప్రాంక‌ర్ ఇంటికి అలాగే విరిగిన కెమెరాతో వెళ్లిపోయాడు, ఈ స‌మ‌యంలో ప్రాంక్ ఏమిటి అస‌లు?