ముఖ్యమంత్రి కుటుంబానికి భారీగా భద్రత

ముఖ్యమంత్రి కుటుంబానికి భారీగా భద్రత

0

మహారాష్ట్రలో ఇటీవల శివసేన కాంగ్రెస్ జోడీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే, అయితే పలువురు సెలబ్రిటీలకు చాలా వరకూ సెక్యూరిటీ సిబ్బందిని తగ్గించేసింది కొత్త ప్రభుత్వం, తాజాగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న ఉద్ధవ్ ఠాక్రే కుటుంబ సభ్యులకు భద్రతను మాత్రం మరింత పెంచారు.

అలాగే భావి నాయకుడు శివసేన లీడర్ సీఎం తనయుడు ఎమ్మెల్యే హోదాలో ఉన్న ఆదిత్య ఠాక్రేకు భద్రతను పెంచినట్టుగా పోలీసు అధికారి ప్రకటించారు. ఆయనకు వై ప్లస్ కేటగిరి నుంచి జెడ్ కేటగిరికి పెంచారు అంతేకాదు ఇప్పటి వరకూ అధికారంలో ఉన్న బీజేపీ నేతలకు కూడా భద్రతని తగ్గించారు. జెడ్ నుంచి వైప్లస్ కు వారి భద్రతని పరిమితం చేశారు.

సచిన్ అలాగే పలువురు సింగర్స్ పలువురు సినిమా సెలబ్రెటీలకు భద్రత తగ్గించారు, ఇటీవల సోనియా రాహుల్ ప్రియాంకల భద్రతను తగ్గించింది కేంద్రం.. ఈ సమయంలో కాంగ్రెస్ నానా యాగీ చేసింది.. మరి తాజాగా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఉన్న శివసేన ఇలా సెక్యూరిటీ తగ్గించడం పై కూడా ఆరోపణలు వస్తున్నాయి… అక్కడ బీజేపీ ఇక్కడ కాంగ్రెస్ ఒకటే పని చేశాయి అని విమర్శిస్తున్నారు.