గద్దలకొండ కోసం మరో సమస్య వచ్చేలా ఉంది..!!

గద్దలకొండ కోసం మరో సమస్య వచ్చేలా ఉంది..!!

0

హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘గద్దల కొండ గణేష్.. ఈ సినిమా కోసం ముందుగా వాల్మీకి అనే పేరును అనుకున్నారు..ఇదే పేరుతో పబ్లిసిటీ కూడా అయ్యింది. అయితే మనోభావాలు దెబ్బతింటాయని బోయ కులస్తులు ఫైర్ అయ్యి మొత్తానికి రిలీజ్ కి ఒక్కరోజు ముందు వాల్మీకి పేరు కాస్త ‘గద్దలకొండ గణేష్’ గా మార్చి రిలీజ్ చేశారు. అయితే ఈ మూవీ మొదటి నుంచి మంచి అంచనాలే అందుకుంది.

రిలీజ్ అయిన అన్ని థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈసినిమా హిందీ డబ్బింగ్ విషయంలో కోటిన్నర రూపాయలు కొనుగోలుదారుల నుంచి ఏదో నిబంధన ఉల్లంఘన నోటీసు వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో మన మేకర్స్ యాభై లక్షలు ఇస్తాం అని చెబుతున్నారు కానీ వాళ్ళు ససేమీరా అంటున్నారు అని తెలుస్తుంది. మరి ఈ వివాదం ఎంత వరకు వెళ్తుందో చూడాలి…