గాలి జనార్దన్ రెడ్డికి బిగ్ షాక్ అక్కడ ఆయనకు నో ఎంట్రీ బోర్డు

గాలి జనార్దన్ రెడ్డికి బిగ్ షాక్ అక్కడ ఆయనకు నో ఎంట్రీ బోర్డు

0

మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి మరో చిక్కు ఎదురైంది. బళ్లారి వెళ్లాలని ముమ్మరంగా ప్రయత్నం చేసిన గాలి జనార్దన్ రెడ్డికి సీబీఐ ద్వారా మరో చిక్కు ఎదురైంది. అప్పట్లో ఓ వెలుగు వెలిగిన మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో నిందితుడు. సుప్రీంకోర్టు పలు షరతులతో బెయిల్ మంజూరు చేసింది.

దాంతో బళ్లారిలో కాకుండా బెంగళూరులో నివాసం ఉంటున్నాడు. తన తన కూతురి పెళ్లి సమయంలో సుప్రీం కోర్టు అనుమతితో కొన్ని రోజులు పెళ్లి పనులు చూసుకొని మరలా బెంగళూరుకు వచ్చారు. ఇప్పుడు సుప్రీంకోర్టు అనుమతి బళ్లారి వెళ్లాలనుకున్న గాలి జనార్దన్ రెడ్డికి సిబిఐ కౌంటర్ తో చెక్ పడింది.

అక్రమ మైనింగ్ కేసులో బళ్లారిలో 47 మంది సాక్షులు లో ఉన్నారని , గాలి జనార్దన్ రెడ్డి బళ్లారి వెళితే సాక్షుల పై ప్రభావం చూపే అవకాశం ఉందని దాంతో కేసు తప్పుదారి పట్టే అవకాశం ఉన్నందున గాలి జనార్దన్ రెడ్డి బళ్లారి వెళ్లకూడదంటూ సీబీఐ సుప్రీంకోర్టులో కౌంటర్ వేసింది. దాంతో బళ్లారి వెళ్లాలనుకున్నా గాలి జనార్దన్ రెడ్డి కి చెక్ పడడంతో బళ్లారిలో అతను వర్గీయులు అయోమయానికి గురయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here