ట్రాన్స్ జెండర్ పై ఐదుగురు యువకులు గ్యాంగ్ రేప్

ట్రాన్స్ జెండర్ పై ఐదుగురు యువకులు గ్యాంగ్ రేప్

0

ఓ ట్రాన్స్ జెండర్ పై ఐదుగురు యువకులు కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేశారు… ఈ ఘటన పాకిస్థాన్ లో జరిగింది… నలుగురు ట్రాన్స్ జెండర్స్ కలిసి ఓ ఈవెంట్ కు వెళ్లి అర్థరాత్రి తిరిగి వస్తుండగా సుమారు ఐదుగురు వ్యక్తులు వారి అడ్డుకున్నారు…

ఆ యువకులు అసభ్యంగా ప్రవర్తించి అందులో ఒక ట్రాన్స్ జెండర్ ను బలవంతగా కిడ్నాప్ చేసి తమ ఫామ్ హౌజ్ కి తీసుకువెళ్లి అత్యాచారం చేశారు… ఆ తర్వాత ఆమెను సహివాల్ అనే నగరంలో వదిలిపెట్టారు… తన స్నేహితురాలి సహాయంతో అక్కడనుంచి ఇంటికి చేరుకున్న తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్లింది.

కానీ పోలీస్ అధికారులు కేసు నమోదు చేసుకోలేదు… దీంతో ఆమె డీపీఓకు వెళ్లి చెప్పగా డీపీఓ పోలీసులకు చెప్పడంతో ఈ ఐదుగురు వ్యక్తులను పోలీస్ అధికారులు అరెస్ట్ చేశారు..