గంజాయి దందా..ఏపీ టూ మహారాష్ట్ర వయా తెలంగాణ

0

గంజాయి అక్రమ రవాణాకు ఎన్ని చర్యలు తీసుకుంటున్న పూర్తి స్థాయిలో అరికట్టలేకపోతున్నారు పోలీసులు తాజాగా తెలంగాణలో గంజాయి కలకలం రేపింది. గంజాయి సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను మేడ్చల్ జిల్లా ఆబ్కారీ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఏపీలోని కాకినాడ జిల్లా పెద్దాపురానికి చెందిన పెరపురెడ్డి అర్జున్‌(25), పెద్దపల్లి జిల్లా, గోదావరిఖనికి చెందిన నేరళ్ల కిరణ్‌కుమార్‌(26), హైదరాబాద్‌ ఫలక్‌నుమాకు చెందిన సయ్యద్‌ తహెర్‌(24)తో పాటు వీరేంద్రకుమార్‌, సందీప్‌, తేజ, ఫజల్‌ ముఠాగా ఏర్పడ్డారు. ఏపీలోని అరకు నుంచి చేపలు రవాణా చేసే ప్లాస్టిక్‌ డబ్బాల్లో గంజాయి ప్యాకెట్లను నింపి డీసీఎంలో విశాఖపట్నంకు తెచ్చారు.

విశాఖ నుంచి నేరుగా వరంగల్‌ వచ్చి అక్కడ నుంచి మహారాష్ట్రలోని సాంగ్లి, సోలాపూర్‌కు తరలించేందుకు కారులోకి గంజాయి ప్యాకెట్లను కారులో ఎక్కిస్తున్నారని చెప్పారు. పక్కా సమాచారంతో ఉప్పల్‌ ఆబ్కారీ పోలీసులు దాడి చేసి.. డబ్బాల్లో ఉన్న 440 కిలోల గంజాయి ప్యాకెట్లను, డీసీఎం వ్యాన్‌, కారును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ గంజాయి విలువ రూ.కోటికి పైగానే ఉంటుంది.  ముఠాలో అర్జున్‌, కిరణ్‌కుమార్‌, తహెర్‌ మాత్రమే పట్టుబడ్డారు. మిగతా నలుగురు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here