ఐఎంఎఫ్​కు గీత​ గుడ్​ బై..తిరిగి హార్వర్డ్ యూనివర్సిటీకే..

Gita says goodbye to IMF .. back to Harvard University ..

0

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎం​ఎఫ్​) ముఖ్య ఆర్థికవేత్త గీతా గోపీనాథ్​ తన విధుల నుంచి వచ్చే ఏడాది జనవరిలో తప్పుకోనున్నారు. గతంలో పని చేసిన హార్వర్డ్ యూనివర్సిటీకే ఆమె తిరిగి వెళ్లనున్నారు. ఈ మేరకు ఐఎంఎఫ్ ప్రతినిధులు తెలిపారు. అలాగే సంస్థకు కొత్త ముఖ్య ఆర్థికవేత్తను త్వరలోనే ప్రకటించనున్నట్లు ఐఎంఎఫ్​ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా వెల్లడించారు.

సంస్థకు గీత అందించిన సేవలు చిరస్మరణీయం. ఆమె అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్నారు. సంస్థపై ఆమె ఎంతో ప్రభావం చూపారు. పలు ముఖ్య కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరించారని ఆమెను జార్జివా ప్రశంసించారు. ​

ఐఎంఎఫ్​ చీఫ్​ ఎకానమిస్ట్​గా బాధ్యతలు చేపట్టే సమయానికి గీత.. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. భారత్​లోని మైసూరులో జన్మించిన గోపీనాథ్​..ఐఎంఎఫ్​ తొలి మహిళా చీఫ్ ఎకనామిస్ట్​గా నియమితులయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here