గోవా బీచ్ లో పర్యాటకులకు బిగ్ షాక్ – 95 మందికి గాయాలు ఆ జంతువులు అటాక్

గోవా బీచ్ లో పర్యాటకులకు బిగ్ షాక్ - 95 మందికి గాయాలు ఆ జంతువులు అటాక్

0

గోవా బీచ్ మంచి పర్యాటక ప్రదేశం. నిత్యం వేలాదిమంది టూరిస్టులు వస్తూ ఉంటారు, అనేక బీచ్ ల సమూహారం కాబట్టి ఇక్కడకు నిత్యం వందల మంది విదేశీయులు కూడా వస్తూ ఉంటారు, అంతేకాదు మంచి ఆతిధ్యం కూడా ఇక్కడ ఉంటుంది, ఇక వీకెండ్ పార్టీలు బ్యాచిలర్ పార్టీలు అన్నీ గోవాలోనే జరుపుకుంటారు, మొత్తానికి ఇప్పుడు గోవా బీచ్ లో అక్కడ పర్యాటకులకి ఓ షాక్ అనే చెప్పాలి.

గోవా బీచ్లో పర్యాటకులను జెల్లీ ఫిష్లు బెంబేలెత్తిస్తున్నాయి. పదుల సంఖ్యలో బీచ్కు చేరిన జెల్లీ ఫిష్లు.. నీటిలోకి దిగిన వారిని తీవ్రంగా గాయపరుస్తున్నాయి. దాదాపు కొన్ని వందల జెల్లీ ఫిష్ లు ఇక్కడకు చేరుకున్నాయి. సముద్రంలో ఆదిలోనే అవి కరుస్తున్నాయి, దీంతో లోపల స్నానానికి దిగిన వారికి జలకాటాలు ఆడుతున్న సమయంలో కరుస్తున్నాయి.

తొడల భాగంలో చాలా మందికి గాయాలు అయ్యాయి. దాదాపు 90 మందికి పైగా పర్యాటకులు గాయాలపాలయ్యారు. గోవా బీచ్ లైఫ్ గార్డ్ ఏజెన్సీ.. దృష్టి మరీన్ ఈ విషయాన్ని వెల్లడించింది. బగ-కలంగుటే బీచ్ లో దాదాపు 55 మందికి గాయాలు అయ్యాయి. సో అక్కడ బోర్డులు కూడా ఏర్పాటు చేశారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here