‘గుడ్​లక్ సఖి’ ట్రైలర్‌ రిలీజ్

0

కీర్తి సురేష్ గుడ్ లక్ సఖి సినిమాను బ్యాడ్ లక్ వెంటాడుతూనే వచ్చింది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ మూవీ పలు మార్లు వాయిదాలు పడుతూ వచ్చింది. థియేటర్లో విడుదల చేయాలా? ఓటీటీకి ఇచ్చేయాలా? అని మేకర్లు కూడా చాలానే తర్జనభర్జనలు పడ్డట్టు కనిపిస్తోంది.

ఇందులో గిరిజిన యువతిగా కీర్తి సురేశ్ నటించింది. షూటింగ్​లో ఓనమాలు తెలియని ఓ యువతి.. జాతీయ స్థాయి షూటర్​గా ఎలా ఎదిగింది? ఇందులో ఎదుర్కొన్న ఆటుపోట్లేంటి అనే కథతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఆది పినిశెట్టి, జగపతి బాబు పాత్రలు ఈ సినిమాకు బలంగా మారనున్నట్టు తెలుస్తోంది. జనవరి 28న గుడ్ లక్ సఖి సినిమా విడుదల కానుంది. పోటీలో మరే చిత్రం కూడా లేదు. ఒక వేళ టాక్ బాగుంటే.. సినిమాకు మంచి వసూళ్లే వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్‌ను విడుదల చేసేందుకు చిత్రయూనిట్ రెడీ అయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here