చెన్నకేశవుల భార్యకు గుడ్ న్యూస్

చెన్నకేశవుల భార్యకు గుడ్ న్యూస్

0

ఆమె మాటలు చూస్తే కోటలు దాటుతున్నాయి.. చదువుకోవాల్సిన వయసులో ప్రేమలో పడి ఓ జులాయిని పెళ్లి చేసుకుంది, ఆమెకు తల్లిదండ్రులు లేకపోవడంతో ఆమె మాటకు ఎవరూ అడ్డు చెప్పలేదు. తన భర్త చేసిన పనికి క్లీన్ చీట్ ఇస్తోంది చెన్నకేశవుల భార్య, తనకు 25 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఆమె వయసు 13 సంవత్సరాలు చిన్నతనంలో పెళ్లి చేసుకుని జీవితం బుగ్గిపాలు చేసుకుంది ప్రస్తుతం గర్భిణీగా ఉంది.

భర్త చేసిన పనికి ఆమెని ఎందుకు శిక్షించడం ఇప్పటికే ఆమెని గ్రామంలో చాలా మంది మాటలతో ఇబ్బంది పెడుతున్నారు, ఇలాంటి జులాయిని పెళ్లి చేసుకుంది అని విమర్శలు చేస్తున్నారు అయితే ఆమె బతుకుదెరువు కోసం ఎదో ఒకటి ప్రభుత్వం చేయాలి అని కోరుతోంది, కాని ఇలాంటి దుర్మార్గాలు చేసిన వారికి వారి కుటుంబాలకు ప్రభుత్వాలు సాయం చేయడం ఎక్కడా జరగదు, కాని ఆమెకు ఏదైనా ప్రభుత్వం చిన్న ఉద్యోగం ఇవ్వాలి అంటున్నారు.

ఆమె వయసు 13 సంవత్సరాలు మరి ఆమెకు ఏ ఉద్యోగం ఇస్తారు ఇది కుదరని పని అయితే ఆమెకు అంగన్ వాడీ లాంటి ఉద్యోగం ఏదో ఒకటి కల్పించాలి అని ఆ గ్రామంలో కొందరు కోరుతున్నారు, కాని ఆమె వయసు ప్రకారం ఆ ఉద్యోగం కూడా వచ్చే అవకాశం లేదు, అందుకే ఆమెకు సదనంలో చదువు చెప్పించాలి అని ప్రభుత్వం భావిస్తోందట.