డిగ్రీ విద్యార్థులకు గుడ్​న్యూస్..కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

Good news for degree students..The central government is a key decision

0

డిగ్రీ విద్యార్థులకు శుభవార్త. పరిశ్రమలు, వివిధ సంస్థల్లో పని అనుభవంతో పాటు స్టయిపెండ్‌ పొందే అప్రెంటిస్‌షిప్‌ అవకాశాన్ని ఈ సంవత్సరం నుంచి డిగ్రీ విద్యార్థులకూ కల్పించనున్నారు. ఇటీవలే దీనిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

పరిశ్రమలు, వివిధ సంస్థల్లో పని అనుభవంతో పాటు స్టయిపెండ్‌ పొందే అప్రెంటిస్‌షిప్‌ అవకాశాన్ని ఈ సంవత్సరం నుంచి డిగ్రీ (ఆర్ట్స్‌, సైన్స్‌, కామర్స్‌) విద్యార్థులకూ కల్పించనున్నారు. ఇప్పటివరకు ఐటీఐ, ఇంటర్‌ ఒకేషనల్‌, పాలిటెక్నిక్‌ ఇంజినీరింగ్‌ పూర్తయిన విద్యార్థులకే ఈ అవకాశం ఉండేది. దానిని డిగ్రీ విద్యార్థులకు విస్తరిస్తూ ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది 2025-26 వరకు అమల్లో ఉంటుంది.

నేషనల్‌ అప్రెంటిస్‌షిప్‌ ట్రైనింగ్‌ స్కీమ్‌ (నాట్స్‌) కింద ఈ శిక్షణ అందిస్తారు. దేశవ్యాప్తంగా వచ్చే అయిదేళ్లలో మొత్తం 9 లక్షల మందికి అవకాశం ఇస్తారు. అందుకు రూ.3,054 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది. సాంకేతిక విద్యతోపాటు సంప్రదాయ కోర్సుల విద్యార్థుల్లోనూ ఉద్యోగ నైపుణ్యాలను పెంచాలని జాతీయ నూతన విద్యా విధానం సిఫారసు మేరకు ఈసారి పథకాన్ని డిగ్రీ విద్యార్థులకూ విస్తరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here