విద్యార్థులకు గుడ్ న్యూస్..ఆరోజే తెలంగాణ ఇంటర్ ఫలితాలు

0

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్..ఈ నెల 26న ఇంటర్‌ ఫస్ట్, సెకండియర్‌ ఫలితాలు వెల్లడించే అవకాశాలున్నాయి. అదేవిధంగా ఈనెల 30 లోగా పదో తరగతి ఫలితాలను విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. ఇంటర్‌ ఫలితాల వెల్లడికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నుంచి బోర్డు అధికారులు అనుమతి కోరినట్టు తెలిసింది.

తొలుత ఈ నెల 25న ఫలితాల వెల్లడిపై అధికారులు ఆసక్తి చూపారు. ఈ విషయాన్ని మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్ళినట్టు సమాచారం.  మూల్యాంకనం తర్వాత మార్కులను కంప్యూటర్‌ ద్వారా ఫీడ్‌ చేశారు. ఈ క్రమంలో తప్పులు దొర్లినట్టు అధికారులు గమనించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో సగటు ఫలితాల విశ్లేషణలో ఎక్కువ మొత్తంలో తేడా ఉన్నట్టు తెలియడంతో కలవరపడ్డారు. దీంతో మరోసారి సమగ్ర విశ్లేషణకు సిద్ధమయ్యారు.

వివరాలన్నీ తెలుసుకున్న మంత్రి ఆలస్యమైనా పర్వాలేదని, అన్నీ పరిశీలించిన తర్వాతే ఫలితాల విడుదలకు సిద్ధమవ్వాలని అధికారులకు సలహా ఇచ్చినట్టు తెలిసింది. కోవిడ్‌ తీవ్రత మధ్యే విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలు రాశారు. ఇలాంటి సమయంలో పొరపాట్లు దొర్లి ఉత్తీర్ణతలో తేడా వస్తే విద్యార్థులు తీవ్ర ఆందోళనకు దిగే అవకాశం ఉందని అధికారులకు మంత్రి సూచించినట్టు తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here