గుడ్ న్యూస్..’కళావతి’ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది-(వీడియో)

0

స్టార్‌ డైరెక్టర్‌ పరుశురాం దర్శకత్వంలో టాలీవుడ్‌ స్టార్‌ హీరో మహేష్‌ బాబు, కీర్తి సురేష్ నటించిన “సర్కారు వారి పాట” 12 మే గురువారం థియేటర్లలో విడుదలయి మహేష్ ఫాన్స్ ను అబ్బురపరిచింది. నవీన్ ఎర్నేని, వైరవిశంకర్ మరియు గోపి ఆచంట నిర్మాతలుగా బాధ్యతలు స్వీకరించి తెరెకెక్కిస్తున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించాడు.

ఈ సినిమా గురువారం థియేటర్లలో విడుదలయి పాజిటివ్ టాకుతో దూసుకుపోతుంది. బ్యాంకింగ్ నేపథ్యంలో కొనసాగిన ఈ సినిమాలో మహేష్ యూఎస్ లో ఓ బ్యాంక్‌ లో రికవరీ ఎంప్లాయ్‌గా కొత్త లుక్ లో కనపడి అభిమానులను ఖుషి చేసాడు. ఈ చిత్రం మంచి కలెక్షన్స్ సాధిస్తూ రికార్డ్స్ క్రీయేట్ చేస్తుంది.

తాజాగా మహేష్ అభిమానులకు చిత్రబృందం అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఈ సినిమాలో ‘కళావతి’ వీడియో సాంగ్ మినహా అన్ని వీడియో సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. తాజాగా ‘కళావతి’ ఫుల్ వీడియో సాంగ్ నిన్న చిత్రబృందం చెప్పిన విధంగానే నేడు 5:04 నిమిషాలకు రిలీజ్ చేసారు.

వీడియో చూడాలనుకుంటే ఈ కింది లింక్ ఓపెన్ చేయండి..

https://youtu.be/SfDA33y38GE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here