గుడ్ న్యూస్..8106 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్

0

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌, రీజనల్‌ రూరల్‌ బ్యాంకుల్లో కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్-11 ద్వారా వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఆఫీసర్లు, ఆఫీస్‌ అసిస్టెంట్‌(మల్టీపర్పస్‌) పోస్టులను భర్తీ చేస్తారు. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

పూర్తి వివరాలు మీ కోసం..

పోస్టుల వివరాలు:

ఆఫీస్‌ అసిస్టెంట్‌(మల్టీపర్పస్‌): 4483
ఆఫీసర్‌ స్కేల్‌-1: 2676
ఆఫీసర్‌ స్కేల్‌-2(అగ్రికల్చర్‌ ఆఫీసర్‌): 12
ఆఫీసర్‌ స్కేల్‌-2(మార్కెటింగ్‌ ఆఫీసర్‌): 06
ఆఫీసర్‌ స్కేల్‌-2(ట్రెజరీ మేనేజర్‌): 10
ఆఫీసర్‌ స్కేల్‌-2(లా): 18
ఆఫీసర్‌ స్కేల్‌-2(సీఏ): 19
ఆఫీసర్‌ స్కేల్‌-2(ఐటీ): 57
ఆఫీసర్‌ స్కేల్‌-2(జనరల్‌ బ్యాంకింగ్‌ ఆఫీసర్‌): 745
ఆఫీసర్‌ స్కేల్‌-3: 80

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత అనుభవం ఉండాలి.

వయసు: పోస్టుల్ని అనుసరించి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌(ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌), ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 27

ఆన్‌లైన్‌ ఎగ్జామినేషన్‌(ప్రిలిమినరీ): ఆగస్టు 2022

ఆన్‌లైన్‌ ఎగ్జామినేషన్‌(మెయిన్‌): సెప్టెంబరు/అక్టోబరు 2022

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here