గోపీచంద్ సినిమాకి టైటిల్ మాములుగా లేదు..!!

గోపీచంద్ సినిమాకి టైటిల్ మాములుగా లేదు..!!

0

యాక్షన్ హీరో గోపీచంద్ కొత్త చిత్రానికి ఊరమాస్ టైటిల్ ని ఫిక్స్ చేశారు దర్శకుడు.. ప్రస్తుతం చాణక్య చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గోపీచంద్ ఆ సినిమా తర్వాత సంపత్ నంది దర్శకత్వంలో సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మాతగా ఓ సినిమా చేయబోతున్నాడు.. తమన్న హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాకు సీటీమార్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. చాణక్య సినిమా థియేటర్లలోకి వచ్చిన కొద్దిరోజులకే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వస్తుంది.

నిజానికి ఈ సీటీమార్ అనే టైటిల్ ఇప్పటిది కాదు. గతంలో రామ్ చరణ్ తో రచ్చ అనే సినిమా చేస్తున్న టైమ్ లోనే సీటీమార్ అనే టైటిల్ తెరపైకి వచ్చింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే రచ్చ స్థానంలో ఈ టైటిలే పడాలి. కానీ మెగా కాంపౌండ్ మాత్రం రచ్చ టైటిల్ వైపు మొగ్గుచూపింది. అలా తెరవెనక్కు వెళ్లిపోయిన సీటీమార్ టైటిల్ ఇన్నాళ్లకు మరోసారి వెలుగులోకి వచ్చింది. గోపీచంద్ సినిమాకు లాక్ అయింది.