తేజతో గోపీచంద్ కొత్త సినిమా

తేజతో గోపీచంద్ కొత్త సినిమా

0

హీరో గోపీచంద్ హిట్స్ కోసం చాలా సంవత్సరాలుగా చూస్తున్నారు.. కాని కమర్షియల్ హిట్ వచ్చి చాలా కాలం అయింది, ఇటీవల వచ్చిన చాణక్య కథ బాగున్నా బాక్సాఫీస్ దగ్గర బేజారింది. ఇక తాజాగా తన పాత దర్శకుడు తేజతో సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట, అయితే కెరియర్ స్టార్టింగ్ లో ఆయన జయం —నిజం సినిమాలో ప్రతినాయకుడిగా నటనలో జీవించారు.

అయితే ఇప్పుడు మాత్రం ఆయన తేజతో కలిసి హీరోగా సినిమా చేస్తారని తెలుస్తోంది. ఇక వీరిద్దరి మధ్య సినిమాకి సంబంధించి సిట్టింగ్ జరిగింది అని తెలుస్తోంది, అంతేకాదు ఎప్పటి నుంచో తన దగ్గర ఉన్న ఓ లైన్ సినిమా గురించి చెప్పారట ఇది గోపికి కూడా నచ్చిందట.

మరింత నేరేషన్ చేసి సినిమాని పూర్తి చేసి తర్వాత గోపితో మరోసారి చర్చించనున్నారు అని తెలుస్తోంది….కుదిరితే వచ్చే సంవత్సరం వీరి ప్రాజెక్ట్ పట్టాలైక్కే అవకాశముంది.. ఇకపోతే గోపిచంద్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో సినిమాను చేస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా చేస్తోంది.