గొట్టిపాటి కూడా టీడీపీకి గుడ్ బై

గొట్టిపాటి కూడా టీడీపీకి గుడ్ బై

0

వల్లభనేని వంశీ టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత అసలు ఆ పార్టీలో ఎవరు ఉంటారు ఎవరు బయటకు ఎప్పుడు వెళతారు అనే విషయంలో అనేక వార్తలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా మాజీలు చాలా మంది తాజాగా పార్టీ మారుదాం అని చూస్తున్నారు.. లోకేష్ చంద్రబాబుపై పార్టీలో నమ్మకం లేక కొనసాగుతున్నారట.. అలాగే పొత్తులు లేకుండా టీడీపీ గెలిచే అవకాశం లేదు అంటున్నారు.

అయితే వల్లభనేని దేవినేని బాటలో మరో నాయకుడు కూడా టీడీపీకి గుడ్ బై చెప్పే అవకాశం ఉంది అంటున్నారు.. ప్రకాశం జిల్లాలోని అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పడం ఖాయమన్న ప్రచారం మొదలైంది.

టీడీపీ నేతగా ఉన్న ఆయన గతంలో వైసీపీలో ఉండేవారు, కాని కొన్ని కారణాల వల్ల ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరిపోయారు.. తర్వాత కరణం వర్గంతో విభేదాలు వచ్చాయి.

ప్రకాశం జిల్లాలో ఆయనకు పలు క్వారీలు ఉన్నాయి. మరి అవి నిలవాలి అంటే అధికార పార్టీలో చేరాలి అని ఆయన భావిస్తున్నారట. తాజాగా హైదరాబాద్ లో జరిగిన మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి మనవడి బర్త్ డే వేడుకల్లో గొట్టిపాటి పాల్గొన్నారు. అక్కడే చర్చ జరిగింది అని అంటున్నారు .మరి ఆయన టీడీపీలో ఉంటారో వైసీపీలో చేరుతారో చూడాలి.