వరంగల్ లో గ్రాండ్ గా ‘విరాట పర్వం’ వేడుక..

0

రానా ద‌గ్గుబాటి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే మంచి సారాంశం ఉన్న కథలను ఎంచుకుంటూ ఎల్లప్పుడూ ప్రేక్షకులకు దగ్గరవుతాడు. ఇటీవలే నటించిన అన్ని సినిమాలు దాదాపు మంచి క్రేజ్ సంపాదించుకున్న విషయం అందరికి తెలిసిందే. కేవలం హీరోగానే కాకుండా విలన్ గా కూడా నటించి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాడు.

తాజాగా విరాట‌ప‌ర్వం సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి మనముందుకొస్తున్నాడు. విరాట‌ప‌ర్వం గ‌తేడాది ప్ర‌థ‌మార్థంలో షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ కరోనా మహమ్మారి కారంణంగా అన్ని సినిమాలలాగే ఈ సినిమా కూడా వాయిదా పడుతూ వచ్చింది. ఈ చిత్రంలో రానా న‌క్స‌లైట్ పాత్ర‌లో మనకు కనబడనుండగా..సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా నటించింది.

ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానున్న నేపథ్యంలో మూవీ యూనిట్ సభ్యులు ప్రమోషన్స్ లో  ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ లాంచ్ కార్యక్రమం కర్నూలులో జరగగా..వర్షం కారణంగా మధ్యలోనే ఆగిపోయింది. ఇక ఇప్పుడు విరాటపర్వం టీం ప్రేక్షకులను మరోసారి కలవడానికి వరంగల్ వేదికగా విరాటపర్వం చిత్ర బృందంతో ఆత్మీయ వేడుకను నిర్వహించనున్నారు. జూన్ 12న సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభం కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here