సగం రెమ్యునరేషన్ ఇచ్చారు బాంబ్ పేల్చిన నిఖిల్

సగం రెమ్యునరేషన్ ఇచ్చారు బాంబ్ పేల్చిన నిఖిల్

0

సరిగ్గా ఏడాది కిందట విడుదలవ్వాల్సిన సినిమా అర్జున్ సురవరం. కాని సంవత్సరం తర్వాత అంటే నేడు విడుదల అవుతోంది.. అయితే నిఖిల్ కెరియర్లో ఎన్నడూ లేని కష్టాలు ఇప్పుడు చూశాడట.. అంతేకాదు ఈ సినిమా కోసం తన పారితోషికం కూడా సగానికి సగం తగ్గించుకున్నాడట.

నేను చేసిన ప్రతీ సినిమాకి పారితోషికం తీసుకున్నా , కాని ఈ సినిమా కోస సగం మాత్రమే పారితోషికం తీసుకున్నా అని చెబుతున్నాడు హీరో నిఖిల్ , అంతేకాదు ఈ సినిమా కోసం కాల్షీట్లు కూడా అదనంగా ఇచ్చాడు. అయితే నిఖిల్ మాత్రం ఇదంతా తమ సినిమా నిర్మాత క్షేమం కోసం అని చెబుతున్నాడు.

సినిమా హిట్ అయి లాభాలు వస్తే కచ్చితంగా నిర్మాత తనకు రావాల్సిన మొత్తం ఇస్తాడనే నమ్మకం ఉందని చెబుతున్నాడు ఈ హీరో. తాను రీమేక్స్ చేయను అని ఇదే తన చివరి రీమేక్ సినిమా అవుతుంది అని తెలియచేశాడు నిఖిల్.