నాకు వాళ్ళతో గొడవలు లేవు

నాకు వాళ్ళతో గొడవలు లేవు

0

హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న వాల్మీకి సినిమా ఈనెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా గురించి మాట్లా డిన దర్శకుడు హరీష్ శంకర్ తన పై వచ్చిన రూమర్స్ పై ఓ క్లారిటీ ఇచ్చాడు.

దాగుడుమూతలు సినిమాను దిల్ రాజు నిర్మాతగా సెట్స్పైకి తీసుకెళ్లడానికి ప్రయత్నించానని అయితే కొన్ని కారణాల వల్ల అది కుదరలేదని అంతమాత్రానికే దిల్ రాజ్ తన గొడవ పడినట్లు పుకార్లు షికార్లు చేశాయి అన్నారు అయితే ఇందులో ఎంత మాత్రం నిజం లేదని దిల్ రాజ్ తో గొడవ జరగలేదని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుతం తాను చేస్తున్న వాల్మీకి సినిమా నిర్మాతలతో కూడా తనకు గొడవలు ఉన్నట్టు ప్రచారం జరిగిందని ఇందులో వాస్తవం లేదని అన్నారు. కర్చు చేయడానికి నిర్మాతలు వెనుకాడక పోయినా తానే నియంత్రణ చేశానని హరీష్ శంకర్ చెప్పుకొచ్చాడు.