అఖిల్ కోసం ట్రై చేస్తున్న హరీశ్ శంకర్

అఖిల్ కోసం ట్రై చేస్తున్న హరీశ్ శంకర్

0

మాస్ పల్స్ తెలిసిన అతి కొద్ది మంది దర్శకుల్లో హరీష్ శంకర్ ఒకరు. కథ ఏదైనా సరే.. మాస్‌ మెచ్చేలా.. వారికి నచ్చేలా చిత్రీకరించడంలో హరీష్ శంకర్ స్టైలే వేరు. అందుకే పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోతో ఓ రీమేక్ తీసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. తాజాగా వరుణ్ తేజ్‌తో కూడా ఓ రీమేక్ చేసి గద్దలకొండ గణేష్‌ అనే కొత్త అవతారాన్ని చూపించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది.

ఈ సినిమా తరువాత హీరోలకి కథలను వినిపిస్తూ తన ప్రయత్నాలను తను చేస్తూనే వున్నాడు శంకర్ . ఇక దాదాపు రెండు కథలని సిద్దం చేసుకుని హీరోలకి వినిపిస్తున్నారు ఆయన, తాజాగా అక్కినేని అఖిల్ తో సినిమా చేసేందుకు రెడీ అయ్యారట…. అయితే ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ ఒక సినిమా చేస్తున్నాడు… ఆ తరువాత సినిమాకిగాను ఆయన ఎవరికీ ఓకే చెప్పలేదు.

అయితే.. ఇదంతా వట్టి పుకారేనని.. ఇలాంటి గాసిప్స్ కామన్ అనే మాట కూడా వినిపిస్తోంది. ఏదేమైన హరీష్ శంకర్ నెక్ట్స్ హీరో ఎవరో ఇప్పుడే చెప్పలేమంటున్నారు.