మీ పాస్‌వర్డ్స్‌ హ్యాక్​ అయ్యాయా..అయితే ఇలా తెలుసుకోండి..

Have your passwords been hacked?

0

వీక్ పాస్‌వర్డ్ ఉపయోగంలో భారత్ ముందువరుసలో​ ఉన్నట్లు ఓ పరిశోధనలో తేలింది. సులభమైన పాస్​వర్డ్స్​ వాడుతుండటం వల్ల హ్యాకర్లు మీ డేటాను సులభంగా తస్కరించవచ్చు. అందుకే అలా జరగకుండా పాస్‌వర్డ్స్‌ విషయంలో మనల్ని అప్రమత్తం చేసేందుకు గూగుల్‌ క్రోమ్‌ లో ఒక సెట్టింగ్‌ ఉంది. అదేంటో తెలుసుకోండి.

హ్యాకర్స్‌, హ్యాకింగ్‌..ఈ పదాలు వింటే చాలు. మనకు ఒకరకమైన భయం కలుగుతుంది. మన ఆన్‌లైన్‌ ఖాతాలకు సెట్‌ చేసిన పాస్‌వర్డ్స్‌ భద్రంగా ఉన్నాయా లేదా అన్న చిన్న సందేహం కూడా కలగక మానదు. అంతేనా ఒకసారి అన్ని అకౌంట్లు ఓపెన్‌ చూసుకొని చెక్ చేసేసుకుంటాం కూడా..ఎందుకంటే ఆన్‌లైన్‌ దొంగలు(హ్యాకర్స్‌) అంతలా భయపెట్టేశారు. అందుకే అలా జరగకుండా పాస్‌వర్డ్స్‌ విషయంలో మనల్ని అప్రమత్తం చేసేందుకు గూగుల్‌ క్రోమ్‌లో ఒక సెట్టింగ్‌ ఉంది. అదేంటో మీరూ తెలుసుకోండి..

మీ పాస్‌వర్డ్ ఎప్పుడైనా హ్యాకింగ్‌కు గురైతే వెంటనే గుర్తించి నోటిఫికేషన్‌ రూపంలో మిమ్మల్ని అలర్ట్‌ చేస్తుంది. అదే పాస్‌వర్డ్‌ చెకర్‌. ఈ ఫీచర్‌ గూగుల్‌ క్రోమ్‌ వెబ్‌ బ్రౌజర్‌, డెస్క్‌టాప్‌ వెర్షన్లలో అందుబాటులో ఉంది. పాస్‌వర్డ్‌లు హ్యాక్ అయ్యాయో లేదో.. ఈ ఫీచర్‌తో తెలుసుకోవచ్చు. అయితే వినియోగదారులు తమ పాస్‌వర్డ్‌లను క్రోమ్‌లో సేవ్‌ చేసుకోవల్సి ఉంటుంది. లేకపోతే ఆ ఫీచర్‌ పని చేయదు. పాస్‌వర్డ్ స్ట్రాంగ్‌గా లేకపోతేనూ.. అది గుర్తించి మనకు ఒక సెక్యూరిటీ అలర్ట్‌ను పంపిస్తుంది.

అసలు పాస్‌వర్డ్‌లు హ్యాకర్స్‌కు దొరక్కుండా ఉండాలంటే..ఒకసారి ఉపయోగించిన పాస్‌వర్డ్‌ని మరోసారి వాడకుండా చూసుకోవాలని సైబర్‌ నిపుణులు చెబుతున్నారు. అన్ని ఆన్‌లైన్ ఖాతాలకు ఒకే పాస్‌వర్డ్‌ ఉపయోగించొద్దని సూచిస్తున్నారు. కాబట్టి పాస్ వర్డ్ ల విషయంలో అప్రమత్తంగా వుండండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here