హలో – ఇలాంటి ఫుడ్ తింటున్నారా అయితే ఇది తప్పక తెలుసుకోండి

0
ఈ రోజుల్లో ఇంటి ఫుడ్ చాలా వరకూ తగ్గించేసి బయట ఫుడ్ కి అలవాటు పడుతున్నారు కొందరు..అయితే  ఉద్యోగాలు వ్యాపారం బిజీ లైఫ్ లో వండుకునే సమయం ఉండటం లేదు …అయితే ఈ ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే అనేక రోగాలకు మీ శరీరం వెల్ కం చెబుతుంది. మనిషికి శుభ్రమైన నీరు ఎంత ముఖ్యమో ఆహారం కూడా అంతే ముఖ్యం.
డేట్ అయిపోయిన  తినుబండారాలు, స్వీట్లు, బేకరీ పదార్థాలు తిని చాలా మంది అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. మీరు బేకరీల్లో స్వీట్ షాపుల్లో కొనే సమయంలో అవి ఎప్పుడు చేశారు ఎప్పటి వరకూ తినవచ్చు అనేది తెలుసుకుని తీసుకోండి. లేకపోతే ప్రమాదం తప్పదు, ఇక డేట్ నాలుగు ఐదు రోజులు ఉన్న ఫుడ్ తీసుకోండి.
ఇలాంటివి తినడం వల్ల  విరోచనాలు, వాంతులు, గ్యాస్ట్రిక్ సమస్యలు, ఉదర సంబంధ వ్యాధులు వస్తున్నాయి.
కచ్చితంగా ఓ విషయం గుర్తు ఉంచుకోండి బేకరీల్లో తయారు చేసే పదార్థాలు ఎన్ని రోజులు నిల్వ ఉంటాయో చెప్పలేని పరిస్థితి.
ఇవి ఎప్పుడు చేశారు అనేది తెలుసుకుని తీసుకోండి, ఇక స్వీట్ షాపుల్లో కూడా ఆ స్వీట్ ఎప్పటి వరకూ ఉంటుంది అనే డేట్ కూడా ఇస్తున్నారు. సో బయట ఫుడ్ అతిగా తింటే సమస్యలు తప్పవు అంటున్నారు డాక్టర్స్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here