ఎక్కిళ్ళను త్వరగా తగ్గించే సింపుల్ చిట్కాలివే..

0

దాదాపు ఎక్కిళ్లు అందరికి వస్తుంటాయి. ఇవి ఎవరైనా మనల్ని తలుచుకున్నప్పుడు వస్తాయని నమ్ముతుంటారు. కానీ ఎక్కిళ్ళు రావడానికి గల కారణం ఏంటంటే..మనకు వెక్కిళ్లు రాగానే శ్వాస ప్రక్రియలో కీలకంగా వ్యవహరించే డయాఫ్రమ్ కండరం సంకోచిస్తుంది. వెంటనే ఊపిరితిత్తుల్లోకి గాలి వేగంగా చేరుతుంది. ఫలితంగా స్వరపేటిక అకస్మాత్తుగా మూసుకుపోయి ‘హిక్’ అనే ధ్వనికి కారణమవుతుంది. దీన్నే వెక్కిళ్లు అని పిలుస్తారు.

కొంతమందికి మందుల వాడకం వల్ల కూడా వెక్కిళ్లు వస్తాయి. కొన్ని మత్తు మందులు, స్టెరాయిడ్స్, పార్కిన్సన్స్ వ్యాధికి తీసుకునే ఔషధాలు, కీమో థెరపీ విధానాలు కూడా వెక్కిళ్లకు దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి వచ్చినప్పుడు తగ్గించుకోవడానికి వివిధ రకాల చిట్కాలు పాటించిన ఆశించినమేరకు ఫలితాలు లభించకపోతే ఈ సింపుల్ చిట్కాలు పాటించి చూడండి.

ఎక్కిళ్ళ‌ను క్ష‌ణాల్లో తగ్గించే సద్గుణం నిమ్మకాయను ఉంటుంది. కావున ఎక్కిళ్ళు వ‌స్తున్న‌ప్పుడు వ‌న్ టేబుల్ స్పూన్ నిమ్మ ర‌సాన్ని డైరెక్ట్‌గానే తీసుకుంటే అవి చాలా త్వ‌ర‌గా ఆగిపోతాయి. లేదంటే నిమ్మ ర‌సానికి బ‌దులుగా ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా ఎక్కిళ్ళ‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఎక్కిళ్ళు బాగా వ‌స్తున్న స‌మ‌యంలో కొద్దిగా అల్లం ర‌సం తీసుకున్నా మంచి ఫ‌లితం ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here